చచ్చినా పర్లేదనుకున్నా : యువీ

యువరాజ్‌సింగ్ పేరు వినగానే అందరికీ ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ చరిత్రలో మర్చిపోలేని రోజు అది. యువీ క్రిజ్‌లో ఉంటే చాలు ఆ మజాని ఆస్వాదించడానికి వచ్చే క్రికెట్ అభిమానులూ చాలానే ఉన్నారు. యువీ మళ్లీ అంతే ఎనర్జీతో 2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ తర సత్తా చాటాడు. ఎలాగైనా ప్రపంచకప్ గెలిచి చరిత్ర తిరగ రాయాలని ఇండియా క్రీడాకారులంతా ఎంతో కఠోరంగా […]

Update: 2020-03-20 05:39 GMT

యువరాజ్‌సింగ్ పేరు వినగానే అందరికీ ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ చరిత్రలో మర్చిపోలేని రోజు అది. యువీ క్రిజ్‌లో ఉంటే చాలు ఆ మజాని ఆస్వాదించడానికి వచ్చే క్రికెట్ అభిమానులూ చాలానే ఉన్నారు. యువీ మళ్లీ అంతే ఎనర్జీతో 2011 వన్డే వరల్డ్‌కప్‌లోనూ తర సత్తా చాటాడు. ఎలాగైనా ప్రపంచకప్ గెలిచి చరిత్ర తిరగ రాయాలని ఇండియా క్రీడాకారులంతా ఎంతో కఠోరంగా శ్రమించారు. అయితే 2011 వరల్డ్‌కప్‌ గెలవడానికి యువీ కీలకపాత్ర పోషించాడనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్‌లలో రాణిస్తూ దాదాపు అన్ని మ్యాచుల్లో కీలకంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో గ్రూప్ దశలో వెస్టిండీస్‌‌తో జరిగిన మ్యాచ్‌లో అనారోగ్యంతో ఉన్నా ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయం అందించాడు. నాటి ప్రపంచకప్ అనుభవాల్సి ఓ మీడియాతో పంచుకుంటూ ఇలా మాట్లాడారు. ‘2011 ప్రపంచకప్‌లో నాకెప్పుడూ శతకం బాదాలి అని ఉండేది. కానీ నేను ఆరోస్థానంలో ఆడటం వల్ల అది సాధ్యం కాలేదు. వరల్డ్ కప్ మొత్తంలో ఆ దేవుణ్ణి ఒక్కటే మొక్కుకున్న ఏం జరిగినా.. ఒకవేళ టోర్ని తర్వాత నేను చనిపోయిన టీమిండియా మాత్రం తప్పకుండా గెలవాలని బలంగా కోరుకున్నాను’ అని తెలిపారు. టోర్నీ మొత్తంలో అద్భుతంగా రాణించిన యువీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.

Tags : Indian player Yuvraj sing, 2011 World Cup, media interview, man of the sireis

 

Tags:    

Similar News