క్వారంటైన్ నుంచి టీమిండియా రిలీవ్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసిన తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపింది. సిడ్నీ శివారులోని సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో సాఫ్ట్ క్వారంటైన్‌లో టీమ్ ఇండియా గురువారం నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు మారింది. హోటల్‌లో పూర్తిగా బయోబబుల్ వాతావరణంలోనికి జట్టు ప్రవేశించింది. అయితే, ఇక్కడ కఠినమైన కరోనా నిబంధనలను పాటించాల్సి ఉన్నది. అయితే హోటల్‌లోని జిమ్‌ను ఉపయోగించుకోవడానికి క్రికెటర్లకు అనుమతి లభించింది. శుక్రవారం […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసిన తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపింది. సిడ్నీ శివారులోని సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో సాఫ్ట్ క్వారంటైన్‌లో టీమ్ ఇండియా గురువారం నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు మారింది. హోటల్‌లో పూర్తిగా బయోబబుల్ వాతావరణంలోనికి జట్టు ప్రవేశించింది. అయితే, ఇక్కడ కఠినమైన కరోనా నిబంధనలను పాటించాల్సి ఉన్నది. అయితే హోటల్‌లోని జిమ్‌ను ఉపయోగించుకోవడానికి క్రికెటర్లకు అనుమతి లభించింది. శుక్రవారం తొలి వన్డే నేపథ్యంలో హోటల్ నుంచి క్రికెట్ మైదానానికి చేరుకోవడానికి నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కేవలం వన్డే జట్టు మాత్రమే మైదానానికి వెళ్లనున్నది. మిగిలిన క్రికెటర్లు హోటల్ గదులకే పరిమితం కానున్నారు.