మళ్లీ హాఫ్ సెంచరీ.. హిట్‌మ్యాన్ ప్రపంచ రికార్డు

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి ప్రపంచ రికార్డు సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు విరాట్ కోహ్లీ(29) పేరుమీద ఉన్న ఈ రికార్డును రోహిత్ శర్మ 30 […]

Update: 2021-11-21 09:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి ప్రపంచ రికార్డు సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు విరాట్ కోహ్లీ(29) పేరుమీద ఉన్న ఈ రికార్డును రోహిత్ శర్మ 30 సార్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా, టీ20ల్లో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ ఒక్కటి కూడా చేయలేదు.

Tags:    

Similar News