సీసీఎస్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసన
దిశ,షాద్ నగర్: పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకుని టీ ఎస్ యూ టీ ఎఫ్ ఫరూక్‌నగర్ మండల ప్రధాన కార్యదర్శి బిజిలి సత్యం ఆధ్వర్యంలో కమ్మదనం యూ పీ ఎస్ పాఠశాల, సాంఘీక సంక్షేమ పాఠశాలలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి ఎన్ పీ ఎస్ అమలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్ […]
దిశ,షాద్ నగర్: పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకుని టీ ఎస్ యూ టీ ఎఫ్ ఫరూక్‌నగర్ మండల ప్రధాన కార్యదర్శి బిజిలి సత్యం ఆధ్వర్యంలో కమ్మదనం యూ పీ ఎస్ పాఠశాల, సాంఘీక సంక్షేమ పాఠశాలలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి ఎన్ పీ ఎస్ అమలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్ ద్రోహానికి నేటితో 16 సంవత్సరాలు గడిచిందన్నారు. ఇప్పటికైనా డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ సిస్టమ్‌ను డిఫైన్డ్ పెన్షన్ సిస్టమ్‌గా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విద్యులత, హెచ్ ఎమ్ టి. నాగరాజు, ఉపాధ్యాయులు సుధామాధవి, వి. అనిత, ఆర్. నవీనకుమార్, టి. అన్నపూర్ణ, ఎమ్. కృష్ణవేణి, హేమలత, ప్రణీత, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.