వినోద్‌కుమార్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు.. ఎందుకంటే!
దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్‌సీ నివేదికపై అన్ని సంఘాలతో చర్చించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. గుర్తింపు పొందిన సంఘాలను కూడా పీఆర్‌సీ చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను భాగస్వాములుగా చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో మాట్లాడి అన్ని సంఘాలను చర్చలకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తానని వినోద్‌కుమార్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.రఘుశంకర్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్‌సీ నివేదికపై అన్ని సంఘాలతో చర్చించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. గుర్తింపు పొందిన సంఘాలను కూడా పీఆర్‌సీ చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను భాగస్వాములుగా చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో మాట్లాడి అన్ని సంఘాలను చర్చలకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తానని వినోద్‌కుమార్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.రఘుశంకర్ రెడ్డి, కె.రమేష్, కె.మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.