కుటుంబంలో మొదటి స్మార్ట్‌ఫోన్.. బ్యాండ్ బాజాతో ఊరేగింపు
దిశ, ఫీచర్స్ : జీవితంలో చిన్న చిన్న సంతోషాలకు వెలకట్టలేం. కోట్ల రూపాయలిచ్చినా ఆ అనుభూతిని కొనలేం. ఐశ్వర్యవంతులు, నిరుపేదలు.. ప్రతీ ఒక్కరి లైఫ్‌లోనూ డబ్బుతో సంబంధం లేని ఆనంద క్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఆప్యాయత, అనుబంధాలతో ముడిపడి ప్రేమానురాగాలను వ్యక్తపరుస్తుంటాయి. అలాంటి సంఘటనకు మధ్యప్రదేశ్ వేదికైంది. కూతురికి ఎంతో ప్రేమగా స్మార్ట్‌ఫోన్ కొనిచ్చిన ఓ చాయ్ వాలా.. తమ కుటుంబంలోని ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఐదేళ్ల కూతురి కోసం […]
దిశ, ఫీచర్స్ : జీవితంలో చిన్న చిన్న సంతోషాలకు వెలకట్టలేం. కోట్ల రూపాయలిచ్చినా ఆ అనుభూతిని కొనలేం. ఐశ్వర్యవంతులు, నిరుపేదలు.. ప్రతీ ఒక్కరి లైఫ్‌లోనూ డబ్బుతో సంబంధం లేని ఆనంద క్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఆప్యాయత, అనుబంధాలతో ముడిపడి ప్రేమానురాగాలను వ్యక్తపరుస్తుంటాయి. అలాంటి సంఘటనకు మధ్యప్రదేశ్ వేదికైంది. కూతురికి ఎంతో ప్రేమగా స్మార్ట్‌ఫోన్ కొనిచ్చిన ఓ చాయ్ వాలా.. తమ కుటుంబంలోని ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
ఐదేళ్ల కూతురి కోసం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన మురారి కుష్వాహ.. ఆమెను గుర్రపు బగ్గీపై కూర్చోబెట్టి బ్యాండ్ బాజాతో ఊరంతా ఊరేగించాడు. చిన్న సంతోషాన్ని కూడా పెద్ద ఎత్తున పండగలా నిర్వహించాడు. రూ. 12,500 విలువైన స్మార్ట్‌ఫోన్ తమ కుటుంబంలోనే మొదటిదని అతను పేర్కొనగా.. సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న మురారి.. హ్యాండ్‌సెట్ కొనుగోలు చేసిన మొబైల్ షాప్ నుంచి శివపురి పట్టణంలోని తన ఇంటికి కూతురిని డప్పు దరువులు, గుర్రపు బండి, బాణసంచా నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు విలేకరులతో తెలిపాడు.
‘నా ఐదేళ్ల కూతురు మొబైల్ ఫోన్ ఇప్పించాలని చాలా కాలంగా అభ్యర్థిస్తోంది. అయితే ఫోన్ కొన్నప్పుడు నగరం మొత్తం అందుకు సాక్షిగా నిలుస్తుందని నా బిడ్డకు గతంలో చేసిన వాగ్దానాన్ని ఈ విధంగా నెరవేర్చాను. ఫోన్‌కు అవసరమైన మొత్తం నాదగ్గర లేకపోవడంతో లోన్‌పై కొనుగోలు చేశాను’ అని మురారి పేర్కొన్నాడు. కాగా తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారనేందుకు ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.
#WatchVideo: A tea seller in #MadhyaPradesh takes home a mobile phone worth Rs 12,500 with Band Baja Barat #News #ViralVideo #MadhyaPradeshNews #Viral #MobilePhone
Read More: https://t.co/z3KCIkJspa pic.twitter.com/y1NySu4laD
— Free Press Journal (@fpjindia) December 21, 2021