అందుకే నన్ను సస్పెండ్ చేశారు : నిమ్మల
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజూ అదేవిధమైన రగడ నెలకొంది. మొదటిరోజు తెలుగుదేశం పార్టీ నేతల ఆందోళన కారణంగా 13 మంది ఎమ్మెల్యేలు ఒకరోజుపాటు సస్పెండ్ అయ్యారు. రెండోరోజు కూడా టిడ్కో ఇళ్ల పంపిణిపై చర్చించాలని టీడీపీ కోరింది. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. దీంతో మళ్లీ టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిసిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజూ అదేవిధమైన రగడ నెలకొంది. మొదటిరోజు తెలుగుదేశం పార్టీ నేతల ఆందోళన కారణంగా 13 మంది ఎమ్మెల్యేలు ఒకరోజుపాటు సస్పెండ్ అయ్యారు. రెండోరోజు కూడా టిడ్కో ఇళ్ల పంపిణిపై చర్చించాలని టీడీపీ కోరింది. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. దీంతో మళ్లీ టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిసిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వాస్తవాలు.. ఆధారాలతో బయట పెడుతున్నందుకే తనను సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. రైతాంగం నష్టపోయాక ఇప్పుడు ప్రీమియం కడితే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీని, రైతులను ప్రభుత్వం తప్పు దోవ పట్టించిందన్నారు.