‘ఇసుక రీచ్‌ల్లో భారీ అక్రమాలు’
అమరావతి: రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన సీఎం జగన్.. ఇసుక మాఫియాకు రూపకల్పన చేశారని విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. అధికార పార్టీకి చెందిన 67మంది ఎమ్మెల్యేలు, 10మంది మంత్రులు, నలుగురు ఎంపీలు ఇసుక మాఫియాలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేసినా.. ఎవరూ […]
అమరావతి: రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిన సీఎం జగన్.. ఇసుక మాఫియాకు రూపకల్పన చేశారని విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. అధికార పార్టీకి చెందిన 67మంది ఎమ్మెల్యేలు, 10మంది మంత్రులు, నలుగురు ఎంపీలు ఇసుక మాఫియాలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ప్రకృతి వనరుల హననం జరుగుతోందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.