టీడీపీకి భారీ షాక్..అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మేయర్

దిశ, ఏపీ బ్యూరో: కాకినాడ మేయర్‌ పీఠంపై టీడీపీకి షాక్ తగిలింది. ప్రస్తుతం మేయర్‌గా టీడీపీకి చెందిన పావని ఉన్నారు. డిప్యూటీ మేయర్‌గా సత్తిబాబు వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరిపై టీడీపీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టగా మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానంలో మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి […]

Update: 2021-10-05 03:30 GMT

దిశ, ఏపీ బ్యూరో: కాకినాడ మేయర్‌ పీఠంపై టీడీపీకి షాక్ తగిలింది. ప్రస్తుతం మేయర్‌గా టీడీపీకి చెందిన పావని ఉన్నారు. డిప్యూటీ మేయర్‌గా సత్తిబాబు వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరిపై టీడీపీలోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టగా మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానంలో మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌లో 44 మంది కార్పొరేటర్లతోపాటు ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు.

మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి ఉండగా..మెుత్తం 46 మంది హాజరై తమ అభిప్రాయాన్ని చేతులెత్తే విధానం ద్వారా తెలియజేశారు. ఈ అవిశ్వాస తీర్మానికి సంబంధించి ప్రిసైడింగ్ అధికారిగా జేసీ లక్ష్మీషా వ్యవహరించారు. మరోవైపు ఈ అవిశ్వాస తీర్మానంపై మేయర్‌ పావని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఫలితాలను ఈనెల 22వరకూ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉంది. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించాక మేయర్‌ పదవి నుంచి పావని వైదొలగాల్సి ఉంటుంది.

Tags:    

Similar News