ఇది ప్రభుత్వం చేసిన హత్య: ఎల్.రమణ

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ ఆరోపణలు చేశారు. సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామంలో దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ముమ్మాటికి విపక్షాలు చేసిన హత్యేనని అధికార పార్టీ నేతలు ఆరోపించడంతో.. ఈ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎల్.రమణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దళిత రైతుల భూమిని ఆక్రమించుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీంతోనే […]

Update: 2020-07-30 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ ఆరోపణలు చేశారు. సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామంలో దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ముమ్మాటికి విపక్షాలు చేసిన హత్యేనని అధికార పార్టీ నేతలు ఆరోపించడంతో.. ఈ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎల్.రమణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

దళిత రైతుల భూమిని ఆక్రమించుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీంతోనే దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యనేని దుయ్యబట్టారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి నష్ట పరిహారం చెల్లించాలని.. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఎల్.రమణ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News