టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా.. ఆయన ఇంటి దగ్గరే ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు పట్టాభి కారును చుట్టుముట్టి రాడ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పట్టాభిరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన పట్టాభిను ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మంది దుండగులు దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని […]

Update: 2021-02-02 02:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా.. ఆయన ఇంటి దగ్గరే ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు పట్టాభి కారును చుట్టుముట్టి రాడ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పట్టాభిరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన పట్టాభిను ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మంది దుండగులు దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు.

పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ఆరోపించారు. 15 మంది వచ్చి తనపై, తన వాహనంపై దాడి చేశారని చెప్పారు. 10 రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నాననే తనపై దాడి చేశారని తెలిపారు.

Tags:    

Similar News