‘పెంచిన చార్జీలు ఉపసంహరించాలి’

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెంచిన బిల్లులను చెల్లించవద్దని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక అల్లాడుతున్న జనంపై ప్రభుత్వం మరింత భారం మోపిందని బోండా ఉమ విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని ఈ సందర్భంగా ఉమ గుర్తు చేశారు. ఈ అంశంపై తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. […]

Update: 2020-05-12 03:47 GMT

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెంచిన బిల్లులను చెల్లించవద్దని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక అల్లాడుతున్న జనంపై ప్రభుత్వం మరింత భారం మోపిందని బోండా ఉమ విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని ఈ సందర్భంగా ఉమ గుర్తు చేశారు. ఈ అంశంపై తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపు జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. పెంచిన చార్జీలకు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని బోండా ఉమ హెచ్చరించారు.

Tags:    

Similar News