అచ్చెన్నాయుడుకి అనారోగ్యం
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు నాటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం ఆపరేషన్ అయిందని తెలిసి కూడా ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించేక్రమంలో ఆయన మరింత అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ […]
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు నాటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం ఆపరేషన్ అయిందని తెలిసి కూడా ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించేక్రమంలో ఆయన మరింత అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 17న మరోసారి ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అధిక రక్తపోటు(బీపీ) నమోదైంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా ఉన్నాయని అచ్చెన్నాయుడు వైద్యులకు తెలిపారు. దీంతో ఆయనకు వైద్యులు మెడిసిన్స్ ఇస్తున్నారు.