10 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.9కోట్లు.. టీటీడీ కీలక నిర్ణయం

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బర్డ్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని స్పెసిఫైడ్‌ అథారిటీ తీర్మానించింది. అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జవహర్‌రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుమల అభివృద్ధి పనులు..నిధుల కేటాయింపులు…హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అన్న అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో స్పెసిఫైడ్ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నిర్మాణంలో […]

Update: 2021-08-06 04:45 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బర్డ్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని స్పెసిఫైడ్‌ అథారిటీ తీర్మానించింది. అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జవహర్‌రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుమల అభివృద్ధి పనులు..నిధుల కేటాయింపులు…హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అన్న అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో స్పెసిఫైడ్ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న దేవాలయాలకు సంబంధించి నిధుల మంజూరుకు స్పెసిఫైడ్ అథారిటీ కమిటీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించింది. త్రిదండి చినజీయర్‌ స్వామి సూచనల మేరకు రాష్ట్రంలో 10 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.9 కోట్లు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. 2021-22 ఏడాదికి 12 లక్షల డైరీలు, 8 లక్షల క్యాలండర్లు, 2 లక్షల చిన్న డైరీలు ముద్రించాలని నిర్ణయించింది. మరోవైపు గ్రీన్‌ ఎనర్జీ వినియోగం కోసం 35 ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు చేయాలని స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే టీటీడీ పాలకమండలి గడువు ముగియడంతో ప్రభుత్వం పాలనా వ్యవహారాల కోసం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ స్పెసిఫైడ్ అథారిటీలో టీటీడీ ఈఓ, అదనపు ఈవో సభ్యులుగా నియమించిన సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News