గ్రేటర్ బరిలో టీడీపీ..ఎన్ని డివిజన్లలో అంటే !
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి పూర్వ వైభవం సంతరించుకునేందుకు తెలంగాణ టీడీపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. గ్రేటర్‌లో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉన్నందున డివిజన్ల వారీగా అభ్యర్థులను ప్రకటించేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 39, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 43డివిజన్లలో పోటీకి దిగాలని ఇప్పటికే హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి డివిజన్‌లో ముగ్గురి పేర్లను పరిశీలించిన పార్టీ.. గెలుపు అవకాశాలను ఉన్నవారిని బరిలోకి […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి పూర్వ వైభవం సంతరించుకునేందుకు తెలంగాణ టీడీపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. గ్రేటర్‌లో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉన్నందున డివిజన్ల వారీగా అభ్యర్థులను ప్రకటించేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 39, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 43డివిజన్లలో పోటీకి దిగాలని ఇప్పటికే హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి డివిజన్‌లో ముగ్గురి పేర్లను పరిశీలించిన పార్టీ.. గెలుపు అవకాశాలను ఉన్నవారిని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది. అధ్యక్షుడు ఎల్. రమణకు ఆదేశాల మేరకు 82డివిజన్ల నుంచి ముగ్గురు చొప్పున దరఖాస్తులను స్వీకరించినట్లు టీడీపీ నేత పి. సాయిబాబా వెల్లడించారు.
పార్టీ జాతీయ రాజకీయ వ్యవహరాల ఇన్‌చార్జి కంభంపాటి రామ్మోహన్‌రావు, అధ్యక్షుడు ఎల్.రమణ, గ్రేటర్ కన్వీనర్ ఎం.అరవింద్ కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలు సమావేశమై జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మొదటి నుండి పార్టీని నమ్ముకున్నవారు, అంకిత భావంతో పని చేసేవారు, గెలిచే అవకాశాలు ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని, డివిజన్ల వారీగా పేర్లను పరిశీలించి, తుది జాబితాను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించి గురువారం ఉదయం అభ్యర్థుల జాబితా ప్రకటించాలని భావిస్తున్నారు.