సవాళ్లు ఉన్నప్పటికీ పెట్టుబడుల కొనసాగింపు : టీసీఎస్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ రంగంలో పెరుగుతున్న అట్రిషన్ రేటు(వలసల రేటు) సహా ఇతర స్వల్పకాల అస్థిరతలు ఎదుర్కొంటున్నప్పటికీ టీసీఎస్ సంస్థ వ్యాపార అవసరాలకు పెట్టుబడులను కొనసాగిస్తుందని సంస్థ సీఎఫ్ఓ అన్నారు. లాభార్జనను కాపాడుకునే క్రమంలో పెట్టుబడులను తగ్గించే ఆలోచన లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సెక్సారియా చెప్పారు. ఇదే సమయంలో కంపెనీ 26-28 శాతం నిర్వహణ లాభాలను సాధించే అంశంపై దృష్టి కొనసాగిస్తుందని, స్వల్పకాలిక లక్ష్యాలనేవి వ్యాపార అవసరాలకు మాత్రమే […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ రంగంలో పెరుగుతున్న అట్రిషన్ రేటు(వలసల రేటు) సహా ఇతర స్వల్పకాల అస్థిరతలు ఎదుర్కొంటున్నప్పటికీ టీసీఎస్ సంస్థ వ్యాపార అవసరాలకు పెట్టుబడులను కొనసాగిస్తుందని సంస్థ సీఎఫ్ఓ అన్నారు. లాభార్జనను కాపాడుకునే క్రమంలో పెట్టుబడులను తగ్గించే ఆలోచన లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సెక్సారియా చెప్పారు. ఇదే సమయంలో కంపెనీ 26-28 శాతం నిర్వహణ లాభాలను సాధించే అంశంపై దృష్టి కొనసాగిస్తుందని, స్వల్పకాలిక లక్ష్యాలనేవి వ్యాపార అవసరాలకు మాత్రమే కట్టుబడి ఉండనున్నట్టు ఆయన వివరించారు.
గతవారం టీసీఎస్ సంస్థ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. మార్కెట్ వర్గాలు అంచనాల స్థాయిలో ఫలితాలు లేవని అభిప్రాయపడ్డాయి. 5 లక్షల మంది ఉద్యోగులతో ఉన్న టీసీఎస్ వలసల రేటు 11.9 శాతంగా ఉండటం, హెచ్ఆర్‌ల కొరత, సేవల సరఫరాలో అంతరాయం లాంటి అంశాలు సంస్థలో ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు విదేశీ మారకం విలువ పెరుగుదల సేవల ఎగుమతులకు ప్రతికూలంగా మారిందని సంస్థ భావిస్తోంది. గతేడాది కొవిడ్-19 సమయంలో సరఫరా, హెచ్ఆర్‌ల విషయంలో టీసీఎస్ ఇతర సంస్థలతో పోలిస్తే మెరుగ్గా ఉందని, సరైన సమయంలో పెట్టుబడులను కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందని సమీర్ చెప్పారు.
టీసీఎస్ సంస్థ గడిచిన ఆరు నెలల కాలంలో మొత్తం 43 వేల మంది కొత్త గ్రాడ్యుయేట్లను తీసుకుంది. ఆ తర్వాత ఏడాది చివరిలోపు మరో 35 వేల మందిని నియమించుకోవాలనే ఆలోచనలో కంపెనీ ఉంది.