రూ. 12 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన టీసీఎస్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి రికార్డులను నమోదు చేసింది. గతవారం ఆర్థిక ఫలితాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్‌లో అత్యధికంగా 3.5 శాతం షేర్ ధర ర్యాలీ చేయడంతో రూ. 3,175ను తాకింది. దీంతో మొదటిసారిగా టీసీఎస్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12 లక్షల కోట్లను దాటింది. గతంలో ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ మాత్రమే సాధించింది. ప్రస్తుత […]

Update: 2021-01-11 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి రికార్డులను నమోదు చేసింది. గతవారం ఆర్థిక ఫలితాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్‌లో అత్యధికంగా 3.5 శాతం షేర్ ధర ర్యాలీ చేయడంతో రూ. 3,175ను తాకింది. దీంతో మొదటిసారిగా టీసీఎస్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12 లక్షల కోట్లను దాటింది.

గతంలో ఈ ఘనతను రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ మాత్రమే సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌లో రూ. 7,504 కోట్లతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 7 శాతానికి పైగా పెరిగి రూ. 8,727 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా 2020 క్యాలెండర్ ఏడాదిలో టీసీఎస్ షేర్లు అత్యధికంగా 33 శాతం పెరిగడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో టీసీఎస్ సంస్థ తొలిసారిగా రూ. 12 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అధిగమించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News