నెక్సాన్ ఎంపిక చేసిన మోడళ్ల ధర పెంచిన టాటా మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ మోడల్ ధరను వేరియంట్‌ను బట్టి రూ. 11,000 వరకు పెంచింది. ఈ పెరుగుదలతో ఈ మోడల్ కారు రూ. 7.30-13.35 లక్షల మధ్య ఉండనుంది. నెక్సాన్ మోడల్‌లో వేరియంట్‌ను బట్టి రూ. 1,000-11,000 మధ్య ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని, డీజిల్ వెర్షన్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ ఆటోమెటీక్ ఎడిషన్ రూ. 11,000 పెంచుతున్నామని కంపెనీ తెలిపింది. అయితే, డీజిల్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ మోడల్ ధరను వేరియంట్‌ను బట్టి రూ. 11,000 వరకు పెంచింది. ఈ పెరుగుదలతో ఈ మోడల్ కారు రూ. 7.30-13.35 లక్షల మధ్య ఉండనుంది.
నెక్సాన్ మోడల్‌లో వేరియంట్‌ను బట్టి రూ. 1,000-11,000 మధ్య ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని, డీజిల్ వెర్షన్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ ఆటోమెటీక్ ఎడిషన్ రూ. 11,000 పెంచుతున్నామని కంపెనీ తెలిపింది. అయితే, డీజిల్ వెర్షన్‌లో ఎక్స్‌జెడ్ ప్లస్, పెట్రోల్ వెర్షన్లలో ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ఏ ప్లస్ డార్క్ ఎడిషన్, సన్‌రూఫ్ వెర్షన్‌లపై ఎలాంటి ధరను పెంచలేదని కంపెనీ స్పష్టం చేసింది.
కాగా, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ ఏడాది మేలో నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనం ధరను రూ. 16,000 పెంచిన సంగతి తెలిసింది. ఎలక్ట్రిక్ విభాగంలో ఈ మోడల్‌లో మూడు ట్రిమ్‌లను కలిగి ఉంది. ఇందులో బేస్ ట్రిమ్ ధరను పెంచలేదని, మిగిలిన వాటి ధరలను పెంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. టాటా నెక్సాన్ 1.5 లీటర్ టర్బో, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో అందుబాటులో ఉంది. రెండు ఇనిజిన్‌లు 6-స్పీడ్ మాన్యూవల్, 6-స్పీడ్ ఆటోమెటిక్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉందని కంపెనీ వివరించింది.