బాలయ్య, చిరుకు తారక్ #betheREALMAN చాలెంజ్

బి ద రియల్ మెన్ చాలెంజ్. లాక్ డౌన్ పీరియడ్ లో ఇంట్లో మహిళల మీద పూర్తి వర్క్ లోడ్ పడుతుందని…. కనీసం ఇలాంటి సమయాల్లో అయినా వారికి హెల్ప్ చేసి రియల్ మెన్ గా ప్రూవ్ చేసుకుందామని పిలుపునిస్తూ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన వంగా… దర్శకులు రాజమౌళికి ఈ చాలెంజ్ విసిరారు. చాలెంజ్ ఆక్సెప్ట్ చేసిన జక్కన్న… టాస్క్ పూర్తిచేసినట్లు ఇంట్లో పని […]

Update: 2020-04-21 00:27 GMT

బి ద రియల్ మెన్ చాలెంజ్. లాక్ డౌన్ పీరియడ్ లో ఇంట్లో మహిళల మీద పూర్తి వర్క్ లోడ్ పడుతుందని…. కనీసం ఇలాంటి సమయాల్లో అయినా వారికి హెల్ప్ చేసి రియల్ మెన్ గా ప్రూవ్ చేసుకుందామని పిలుపునిస్తూ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన వంగా… దర్శకులు రాజమౌళికి ఈ చాలెంజ్ విసిరారు. చాలెంజ్ ఆక్సెప్ట్ చేసిన జక్కన్న… టాస్క్ పూర్తిచేసినట్లు ఇంట్లో పని చేసిన వీడియో షేర్ చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శోభు యార్లగడ్డ, సుకుమార్, ఎం.ఎం. కీరవాణి లను నామినేట్ చేశారు.

జక్కన్న విసిరిన #betheREALMAN చాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు తారక్. ఇళ్లు శుభ్రంగా తుడిచి, వస్తువులను క్లీన్ చేసిన తారక్… గార్డెన్ లో చెత్తను శుభ్రంగా ఊడ్చి ఎత్తాడు. తద్వారా ఈ చాలెంజ్ కంప్లీట్ చేశాడు. మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలు మాత్రమే కాదు .. పనులనుకూడా పంచుకుందాం .. పని భారాన్ని పంచుకున్నప్పుడు సరదాగా ఉంటుందని తెలిపాడు. #betheREALMAN చాలెంజ్ కు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కొరటాల శివను నామినేట్ చేశారు తారక్. మొత్తానికి సందీప్ వంగా చాలెంజ్… టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిపోయింది. రాజమౌళి, తారక్ లు యాక్సెప్ట్ చేసిన చాలెంజ్… ఇండస్ట్రీ ప్రముఖులంతా స్వీకరించి… ఇంట్లో పని చేయడం, భార్యకు సహకరించడం లో ఎలాంటి తప్పు లేదని సందేశం ఇస్తున్నారు. ఇది నిజానికి గొప్ప విషయం అనే మెసేజ్ ఇస్తున్నారు.

Tags : NTR, SSRajamouli, Sandeep Vanga, Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh, Koratala Shiva

Tags:    

Similar News