'వీఆర్ఏలు సర్పంచ్ దగ్గర పని చేయాలని జీవో ఉందా..?'
దిశ,పిట్లం: గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు, సర్పంచులు చెప్పిన మాట వినడం లేదని మండిపడ్డారు. శుక్రవారం వారిపై మండల తహసీల్దార్ రామ్మోహన్ కు ఫిర్యాదు చేశారు. వీఆర్ఏలు మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తారు. రాత్రి, పగలు కార్యాలయంలో విధులు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ సర్పంచులు చెప్పిన మాట ఎందుకు వినడం లేదని ఎంపీపీ కవిత భర్త విజయ్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు తహసీల్దార్ కార్యాలయంలో గొడవకు దిగారు. వారికి ప్రభుత్వం జీతం ఇస్తున్నది మీ […]
దిశ,పిట్లం: గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు, సర్పంచులు చెప్పిన మాట వినడం లేదని మండిపడ్డారు. శుక్రవారం వారిపై మండల తహసీల్దార్ రామ్మోహన్ కు ఫిర్యాదు చేశారు. వీఆర్ఏలు మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తారు. రాత్రి, పగలు కార్యాలయంలో విధులు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ సర్పంచులు చెప్పిన మాట ఎందుకు వినడం లేదని ఎంపీపీ కవిత భర్త విజయ్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు తహసీల్దార్ కార్యాలయంలో గొడవకు దిగారు. వారికి ప్రభుత్వం జీతం ఇస్తున్నది మీ ఇండ్లలో పని చేయడానికి, మీ కార్లు డ్రైవింగ్ చేయడానికి, తుడువటానికి కాదని ఎంపీపీ భర్త తహసీల్దార్ ను నిలదీశారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల మాట వినకపోతే వారు గ్రామాలలో ఏం పని చేస్తారని ప్రశ్నించారు. గ్రామాల సర్పంచుల వద్దకు అధికారులు వస్తే గ్రామంలో ఉన్న వ్యక్తుల పేర్లు వీఆర్ఏ లకు తెలుసు అని ప్రశ్నించారు. అధికారులు చెప్పిన మాట సర్పంచులు చెప్పిన మాట వినకపోతే సర్పంచి పనులు ఎలా చేయాలాని ప్రశ్నించారు. తహసీల్దార్ రామ్ మోహన్ రావు సర్పంచులు చెప్పిన మాట వినాలి అని ఏమైనా జీవో ఉంటే తీసుకురావాలని అడిగారు. టీఆర్ఎస్ నాయకులకు, తహసీల్దార్ సిబ్బందికి మధ్య గంట సేపు వాగ్వివాదం కొనసాగింది. బాన్సువాడ డివిజన్ ఆర్డీవో రాజా గౌడ్ కు తహసీల్దార్ పై ఫిర్యాదు చేశారు.