టారిఫ్‌లు పెంచే యోచనలో ఎయిర్‌టెల్!

దిశ, సెంట్రల్ డెస్క్: గతంలో కంటే టెలికాం పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ టారిఫ్‌లు ఇంకా తక్కువగానే ఉన్నట్టు భారతీ ఎయిర్‌టెల్ ఇండియా సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కనీస ధరల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను అభ్యర్థించామని చెప్పారు. తమ వద్ద ఉన్నటువంటి స్పెక్ట్రంల అండతో సంస్థ మెరుగైనా స్థితిలోనే ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల కారణంగా జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ. 5,237 […]

Update: 2020-05-31 04:37 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: గతంలో కంటే టెలికాం పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ టారిఫ్‌లు ఇంకా తక్కువగానే ఉన్నట్టు భారతీ ఎయిర్‌టెల్ ఇండియా సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కనీస ధరల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను అభ్యర్థించామని చెప్పారు. తమ వద్ద ఉన్నటువంటి స్పెక్ట్రంల అండతో సంస్థ మెరుగైనా స్థితిలోనే ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల కారణంగా జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ. 5,237 కోట్ల నష్టాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడిలో ఏజీఆర్ బకాయిల వల్లే నష్టపోయామని కంపెనీ ప్రకటించింది. పెట్టుబడులపై కంపెనీకి ప్రయోజనాలు ఉండాలంటే ప్రస్తుతం ఉన్న వినియోగదారుల నుంచి అందే ఆదాయం రూ. 154 సరిపోదని, రానున్న కాలంలో ఇది రూ. 200 అవుతుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.. రానున్న ఏడాదిలో మూలధన వ్యయ కేటాయింపులు తగ్గొచ్చని గోపాల్ విట్టల్ చెప్పారు.

ప్రస్తుత త్రైమాసికంలో వినియోగదారుల నుంచి సగటు ఆదాయం రూ. 154 ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 123 ఉందని, 4జీకి అప్‌గ్రేడ్ చేయడంతో కొంత పెరుగుదల ఉన్నప్పటికీ టారిఫ్‌లు మాత్రం తక్కువగానే ఉన్నట్టు ఆయన గుర్తుచేశారు. జియో ఎంట్రీ తర్వాత టారిఫ్‌లు అమాంతం దిగజారాయని, అయితే, గతేడాది డిసెంబర్ నుంచి 40 శాతం పెరుగుదల నమోదవడం ఊరట కలిగిస్తోందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News