నువ్వు నా మార్గదర్శివి.. హ్యపీ బర్త్‌డే అన్న : తారక్
నందమూరి కుటుంబ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కథానాయకుడు కల్యాణ్‌రామ్. 1989లో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. ఇక హీరోగా ‘అతనొక్కడే’ చిత్రంతో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘లక్ష్మీకళ్యాణం, పటాస్, ఇజం’ తదితర చిత్రాలు.. కల్యాణ్‌రామ్‌కు మంచి విజయాల్ని అందించాయి. ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా తనదైన పాత్రను పోషిస్తూ తాతకు తగ్గ మనవడిగా టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ‘ఎంతమంచి వాడవురా’ […]
నందమూరి కుటుంబ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కథానాయకుడు కల్యాణ్‌రామ్. 1989లో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. ఇక హీరోగా ‘అతనొక్కడే’ చిత్రంతో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘లక్ష్మీకళ్యాణం, పటాస్, ఇజం’ తదితర చిత్రాలు.. కల్యాణ్‌రామ్‌కు మంచి విజయాల్ని అందించాయి. ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా తనదైన పాత్రను పోషిస్తూ తాతకు తగ్గ మనవడిగా టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ‘ఎంతమంచి వాడవురా’ సినిమాతో ప్రేక్షకులు అలరించారు కళ్యాణ్ రామ్. ఆదివారం పుట్టినరోజు సందర్భంగా తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్.. కల్యాణ్‌రామ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు.
కల్యాణ్, తారక్లది ప్రత్యేక అనుబంధం. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఇంతవరకు ఇద్దరూ కలిసి వెండితెరపై కనిపించలేదు కానీ.. అనేకసార్లు పలు వేదికలపై కలిసి మాట్లాడారు. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జైలవకుశ’ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నిర్మించిన విషయం తెలిసిందే. కల్యాణ్ రామ్ పుట్టినరోజున తారక్ ట్విట్టర్ వేదికగా ‘నువ్వు నాకు అన్నయ్య మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువే. నా మార్గదర్శి మాత్రమే కాదు.. నా ఫ్రెండ్, ఫిలాసఫర్ కూడా. నువ్వు నిజంగా అందరికన్నా బెస్ట్. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్ అన్న’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కల్యాణ్ రామ్.. మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అతని పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.