షాకింగ్.. క్షుద్రపూజల పేరుతో బాలికకు మత్తుమందు ఇచ్చి..

దిశ, వెబ్ డెస్క్ : క్షుద్రపూజల పేరుతో బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు ఓ కిరాతకత తాంత్రికుడు. బాలిక అనారోగ్యంతో మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా.. మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన యూపీలోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు తహ్రీర్​పై అత్యాచార, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఈ నెల 22వ తేదీన రాత్రి బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో […]

Update: 2021-03-26 06:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : క్షుద్రపూజల పేరుతో బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు ఓ కిరాతకత తాంత్రికుడు. బాలిక అనారోగ్యంతో మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా.. మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన యూపీలోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు తహ్రీర్​పై అత్యాచార, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. ఈ నెల 22వ తేదీన రాత్రి బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాధితురాలి తల్లి తాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్లింది. ఇదే అదునుగా భావించిన కామాంధుడు.. చికిత్స పేరిట బాలికకు మత్తు మందు ఇచ్చి.. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ క్రమంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తస్రావం చూసిన బాధితురాలి తల్లి ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

Tags:    

Similar News