‘నియంతృత్వ పోకడకు నోటికి తాళం’
న్యూఢిల్లీ: జాతి వ్యతిరేకులు, విభజన శక్తులు దేశంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నాయని, విద్వేషం, హింసాపూరిత విషాన్ని వెదజల్లుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ అన్నారు. దేశ ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోతున్నాయని, కొన్ని శక్తులు అందరి నోళ్లూ మూయిస్తున్నాయని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, రాజ్యాంగబద్ధ సంస్థలు ధ్వంసమవుతున్నాయని, కుత్సితులు ఎత్తులే అధికంగా ప్రచారమవుతున్నాయని చెప్పారు. ఛత్తీస్‌గడ్ నవరాయ్‌గడ్‌లో కొత్త అసెంబ్లీకి ఆన్‌లైన్‌లో శంకుస్థాపన చేస్తూ సోనియా గాంధీ ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు ప్రజాస్వామ్యం […]
న్యూఢిల్లీ: జాతి వ్యతిరేకులు, విభజన శక్తులు దేశంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నాయని, విద్వేషం, హింసాపూరిత విషాన్ని వెదజల్లుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ అన్నారు. దేశ ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోతున్నాయని, కొన్ని శక్తులు అందరి నోళ్లూ మూయిస్తున్నాయని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, రాజ్యాంగబద్ధ సంస్థలు ధ్వంసమవుతున్నాయని, కుత్సితులు ఎత్తులే అధికంగా ప్రచారమవుతున్నాయని చెప్పారు.
ఛత్తీస్‌గడ్ నవరాయ్‌గడ్‌లో కొత్త అసెంబ్లీకి ఆన్‌లైన్‌లో శంకుస్థాపన చేస్తూ సోనియా గాంధీ ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు ప్రజాస్వామ్యం ఈ సవాళ్లను ఎదుర్కుంటుందని అప్పటి నేతలు ఆలోచించి ఉండరని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో పడుతుందని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జీవీ మవలంకర్‌లు ఊహించికూడా ఉండరని చెప్పారు. రాజ్యాంగం భవనాల ద్వారా కాదని, ప్రజల భావోద్వేగాలతో బ్రతుకుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు.