పెసరకు రూ.40 వేలు ప్రకటించాలి: తమ్మినేని

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఖ‌మ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని భగవాన్ నాయక్ తండాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పెసర పంట పూర్తిగా దెబ్బతినిందన్నారు. ఎకరాకు రూ.40 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా […]

Update: 2020-08-19 10:24 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఖ‌మ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని భగవాన్ నాయక్ తండాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పెసర పంట పూర్తిగా దెబ్బతినిందన్నారు. ఎకరాకు రూ.40 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News