'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ స్ట్రీమింగ్ ఆపాలని తమిళుల డిమాండ్
దిశ, సినిమా: లేటెస్ట్ సెన్సేషనల్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు నామ్ తమిళర్ కాట్చి(NTK) ఫౌండర్ సీమన్. ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్‌కు లేఖ రాశారు. తమిళులను దుర్మార్గంగా చూపించిన సిరీస్.. ఎల్‌టిటిఈను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తుందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా స్ట్రీమింగ్ ఆపకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ్స్ అమెజాన్ సర్వీస్‌లను బాయ్ కాట్ చేయాలంటూ మాసివ్ క్యాంపెయిన్ చేపడతామని హెచ్చరించారు. తమిళుల గురించి […]
దిశ, సినిమా: లేటెస్ట్ సెన్సేషనల్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు నామ్ తమిళర్ కాట్చి(NTK) ఫౌండర్ సీమన్. ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్‌కు లేఖ రాశారు. తమిళులను దుర్మార్గంగా చూపించిన సిరీస్.. ఎల్‌టిటిఈను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తుందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా స్ట్రీమింగ్ ఆపకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ్స్ అమెజాన్ సర్వీస్‌లను బాయ్ కాట్ చేయాలంటూ మాసివ్ క్యాంపెయిన్ చేపడతామని హెచ్చరించారు.
తమిళుల గురించి అసభ్యకర వర్ణనను చూసి షాక్ అయ్యానన్న ఆయన.. తమీజ్ ఇజమ్ ఫ్రీడమ్ స్ట్రగుల్‌ను ఇంత చీప్‌గా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ’ సిరీస్.. తమిళుల మాతృభూమిని ఆక్రమించి, ఆధిపత్యం చలాయించి సర్వనాశనం చేసిన సింహళ ప్రభుత్వ వాయిస్‌ను వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. సింహళ భావజాలనికి అనుకూలంగా, తమిళులకు వ్యతిరేకమైన కంటెంట్‌ను కలిగిన సిరీస్.. చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందన్నారు. ఎల్‌టిటిఈ వ్యవస్థాపకుడు ప్రభాకర్‌ను నెగెటివ్‌గా చూపించిందని మండిపడ్డారు సీమన్.