తమిళనాట స్టాలిన్ వరాలు.. సంచలన హామీలు ఇచ్చిన సీఎం
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో డీఎంకే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. దీంతో తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు వరాలు కురిపించాడు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో కరోనా చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. రాష్ట్రవ్యా్ప్తంగా […]
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో డీఎంకే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. దీంతో తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు వరాలు కురిపించాడు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో కరోనా చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. రాష్ట్రవ్యా్ప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ డబ్బులను రెండు విడుతలుగా ప్రజలకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆవిన్ పాలపై లీటర్కి రూ.3 తగ్గించారు. తమిళనాడులో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అని సంచలన ప్రకటన చేశారు.