తమన్నా.. ఏమన్న ‘శృతి’ కలిపిందా!

హీరోయిన్లు శృతి హాసన్, తమన్నా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. శృతి గురించి అడిగినప్పుడల్లా మిల్కీ బ్యూటీ చాలా ఎగ్జైట్ అవుతుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంతే ఆనందంగా శృతి గురించి చాలా విషయాలు చెప్పింది తమ్ము. శృతి ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన తమన్నా భాటియా.. తనలో పాజిటివ్‌నెస్ మా ఇద్దరినీ దగ్గర చేసిందని చెప్పింది. శృతికి నెగెటివిటి అంటే అస్సలు ఇష్టముండదని.. ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతుందని […]

Update: 2020-06-05 03:17 GMT

హీరోయిన్లు శృతి హాసన్, తమన్నా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. శృతి గురించి అడిగినప్పుడల్లా మిల్కీ బ్యూటీ చాలా ఎగ్జైట్ అవుతుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంతే ఆనందంగా శృతి గురించి చాలా విషయాలు చెప్పింది తమ్ము. శృతి ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన తమన్నా భాటియా.. తనలో పాజిటివ్‌నెస్ మా ఇద్దరినీ దగ్గర చేసిందని చెప్పింది. శృతికి నెగెటివిటి అంటే అస్సలు ఇష్టముండదని.. ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతుందని వివరించింది. ముంబైలో ఉన్నప్పుడు ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో తరుచూ కలుసుకునే వాళ్లమని,ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లమని వివరించింది. అయితే శృతిని ఎప్పుడు కలిసినా చాలా కొత్తగా ఉంటుందని.. తను ఇప్పటికి కూడా నన్ను చిన్నపిల్లలాగే చూస్తుందంటూ సంబరపడిపోయింది తమన్నా.

కాగా తెలుగులో గోపీ చంద్ సినిమా సిటీమార్‌లో కబడ్డీ కోచ్‌గా తమన్నా నటిస్తుండగా… మాస్ మహారాజా రవితేజ క్రాక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాల్లో కనిపించబోతోంది శృతి హాసన్.

Tags:    

Similar News