మద్యం తాగి డ్రైవింగ్ చేసిన 3,571మందిపై కేసులు

దిశ, క్రైమ్ బ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన 3,571మందిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ కారణంగా డ్రంకన్ డ్రైవ్‌లు నిలిపి వేసిన పోలీసులు మళ్లీ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మొదలు పెట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో డిసెంబరు 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు 931 మందిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని […]

Update: 2021-01-04 09:33 GMT
CP Sajjanar
  • whatsapp icon

దిశ, క్రైమ్ బ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన 3,571మందిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ కారణంగా డ్రంకన్ డ్రైవ్‌లు నిలిపి వేసిన పోలీసులు మళ్లీ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మొదలు పెట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో డిసెంబరు 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు 931 మందిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గడిచిన వారం రోజుల్లో డిసెంబరు 27నుంచి జనవరి 3వరకు 3,571 డ్రంకన్ కేసులను నమోదు చేసినట్టు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. వీటిలో అత్యధికంగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 714, గచ్చిబౌలి‌లో 709, కూకట్‌పల్లిలో 515, రాజేంద్రనగర్‌లో 303 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News