ఆ నిర్మాత నన్ను మోసం చేశారు.. నటి తాప్సి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : హీరోయిన్ తాప్సీ పన్ను బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా సరే బ్లాక్ బస్టర్ సినిమాలతో సమాధానం చెప్తున్న బ్యూటీ.. యూనిక్ కంటెంట్‌తో అదరగొడుతోంది. ప్రస్తుతం ‘హసీన్ దిల్‌రుబా’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న తాప్సీ.. గతంలో తనకు చెప్పకుండానే ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని రివీల్ చేసింది. మూవీ కోసం డేట్స్ ఇచ్చి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశానని, ఈలోపు మీడియా రిపోర్ట్స్ ద్వారా తనను రీప్లేస్ చేశారని చెప్పింది. […]
దిశ, సినిమా : హీరోయిన్ తాప్సీ పన్ను బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా సరే బ్లాక్ బస్టర్ సినిమాలతో సమాధానం చెప్తున్న బ్యూటీ.. యూనిక్ కంటెంట్‌తో అదరగొడుతోంది. ప్రస్తుతం ‘హసీన్ దిల్‌రుబా’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న తాప్సీ.. గతంలో తనకు చెప్పకుండానే ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని రివీల్ చేసింది. మూవీ కోసం డేట్స్ ఇచ్చి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశానని, ఈలోపు మీడియా రిపోర్ట్స్ ద్వారా తనను రీప్లేస్ చేశారని చెప్పింది.
ఆ తర్వాత మేకర్స్ క్షమాపణలు చెప్పినా.. అసలు కారణాలను ఇంకా చెప్పలేదని వివరించింది. కాగా నేషనల్ మీడియా రిపోర్ట్ ప్రకారం 2019లో వచ్చిన ‘పతీ పత్నీ ఔర్ వో’ సినిమాకు డైరెక్టర్ తాప్సీని సెలెక్ట్ చేసినా.. నిర్మాతలు మరొకరిని సూచించడంతో తనకు తెలియకుండానే ఆ ప్రాసెస్ జరిగిపోయిందట. కాగా ఈ సినిమాలో భూమి పెడ్నేకర్, అనన్యా పాండే, కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు.