స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-హబ్ కొత్త భాగస్వామ్యం!
దిశ, వెబ్‌డెస్క్: టీ-హబ్ ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్శిటీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా లా ట్రోబ్ యూనివర్శిటీ ఎంపిక చేసిన స్టార్టప్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను, భారత్‌లో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ గురించి లోతైన అవగాహన కల్పించనుంది. గ్లోబల్ మార్కెట్ యాక్సిలరేటర్ కార్యక్రమం ద్వారా దేశీయ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు, సహాయం చేసేందుకు లా ట్రోబ్ యూనివర్శిటీ సహాయపడనుంది. ఈ కార్యక్రమాన్ని యూనివర్శిటీ వారు ఐదు దేశాల్లో ప్రారంభించారు. దీనికోసం విక్టోరియా స్టేట్ ఆఫీస్‌లోని […]
దిశ, వెబ్‌డెస్క్: టీ-హబ్ ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్శిటీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా లా ట్రోబ్ యూనివర్శిటీ ఎంపిక చేసిన స్టార్టప్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను, భారత్‌లో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ గురించి లోతైన అవగాహన కల్పించనుంది. గ్లోబల్ మార్కెట్ యాక్సిలరేటర్ కార్యక్రమం ద్వారా దేశీయ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు, సహాయం చేసేందుకు లా ట్రోబ్ యూనివర్శిటీ సహాయపడనుంది. ఈ కార్యక్రమాన్ని యూనివర్శిటీ వారు ఐదు దేశాల్లో ప్రారంభించారు. దీనికోసం విక్టోరియా స్టేట్ ఆఫీస్‌లోని ఆస్ఇండస్ట్రీ నిధులను సమకూరుస్తుంది.
ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ ప్రధాన ఏజెన్సీయే ఆస్ఇండస్ట్రీ. ఇది పరిశ్రమ, పరిశోధన, ఆవిష్కరణలకు తోడ్పడేలా సహాయాన్ని, కార్యక్రమాలను, సేవలను అందిస్తుంది. భారత్‌లోని స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌ను ఎంచుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఎనిమిది వారాల పాటు ఆన్‌లైన్ వేదిక ద్వారా జరగనుంది. అలాగే, అంతర్జాతీయ స్థాయి అనుభవం కోసం టీ-హబ్ లాంటి ఇన్నోవేషన్ హబ్‌లలో ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ‘కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు భారత్‌లో తమ కార్యాలయాలను విస్తరించడానికి సిద్ధపడుతున్నారు. హైదరాబాద్ పెద్ద బ్రాండ్ కంపెనీలను మాత్రమే కాకుండా స్థానిక స్టార్టప్‌లను ఆకర్షిస్తోందని టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ చెప్పారు.