లిక్కర్ ఆన్ వీల్స్.. ఎక్సైజ్ పాలసీ ఫాల్స్!
దిశ, వరంగల్: ఇప్పుడు అక్కడి వెళ్లాల్సిన పని లేదు. నేరుగా వాళ్లే ఊరిలోకి వస్తున్నారు.. ఏదీ కావాలంటే అది తెచ్చి ఇస్తున్నారు. అంతెందుకు బిల్లులు కూడా అక్కడికక్కడే ఇస్తున్నారు. ఇలా ఇప్పుడది కొంగొత్తగా ఉన్నది. దీంతో అక్కడి జనమంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటీ ఈ విచిత్రం అంటూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటో మీరే చూడండి.. ఒకనాడు పల్లెలు, గ్రామాలలో గంపల్లో కూరగాయాలు, పండ్లు పెట్టుకుని అమ్మకాలు సాగించేవారిని చూశాం. అంతెందుకు.. అది ఇప్పటికీ అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. […]
దిశ, వరంగల్: ఇప్పుడు అక్కడి వెళ్లాల్సిన పని లేదు. నేరుగా వాళ్లే ఊరిలోకి వస్తున్నారు.. ఏదీ కావాలంటే అది తెచ్చి ఇస్తున్నారు. అంతెందుకు బిల్లులు కూడా అక్కడికక్కడే ఇస్తున్నారు. ఇలా ఇప్పుడది కొంగొత్తగా ఉన్నది. దీంతో అక్కడి జనమంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటీ ఈ విచిత్రం అంటూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటో మీరే చూడండి..
ఒకనాడు పల్లెలు, గ్రామాలలో గంపల్లో కూరగాయాలు, పండ్లు పెట్టుకుని అమ్మకాలు సాగించేవారిని చూశాం. అంతెందుకు.. అది ఇప్పటికీ అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే, వాహనాలపై విక్రయిస్తున్నారు. కానీ, ప్రస్తుతం సమాజంలో గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఇప్పుడు పల్లెలు, గ్రామాల్లో అదే వాహనాల్లో మద్యం వ్యాపారులు బ్రాందీ, బీరు అమ్మకాలు మొదలుపెట్టారు. వినడానికే ఇది విచిత్రంగా ఉంది కదూ!. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ పరిధిలోని కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్ గా అవతారమెత్తి నయా దందాకు తెరతీశారు. పల్లెలు, గ్రామాల్లోని బెల్ట్ షాపులకు వీరే స్వయంగా వాహనాల్లో మద్యం రవాణా చేస్తున్నారు. అక్కడికక్కడే బిల్లులు రాసి ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా స్వయంగా గమనిస్తున్న ఆ పల్లె జనాలు ఏందీ ఈ విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
సిండికేట్ల మాయ..
తెలంగాణ పల్లెల్లో ఏ శుభకార్యానికైనా, అశుభకార్యానికైనా ముందు గుర్తుకు వచ్చేది మందే..? ఇక్కడి జనం మద్యం అంటే అంత ఇష్టం పెంచుకున్నారు. అలాంటి మద్యం అమ్మకాలు కొంతకాలం కిందట పట్టణాలకే పరిమితమవగా డిమాండ్ ను బట్టి ఆ తర్వాత కుగ్రామాలకూ విస్తరించాయి. వైన్ షాపు నిర్వాహకులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు గ్రామాల్లో బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. దీంతో బెల్ట్ షాపు నిర్వాహకులు పట్టణాల్లోని వైన్ షాపుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు సాగించేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం మద్యం వ్యాపారులే నేరుగా బెల్ట్ షాపులకు మందు రవాణా చేస్తున్నారు. నర్సంపేట డివిజన్ లోని చెన్నారావుపేట, ఖానాపూర్, నల్లబెల్లి, దుగ్గొండి, నెక్కొండ మండలాల్లో ఈ తరహానే విక్రయాలు ఎక్కవగా కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో రెండేసి చొప్పున వైన్ షాపులు దక్కించుకున్న వ్యాపారులు సిండికేట్ అయినట్లు సమాచారం. వీళ్లంతా ఏకాభిప్రాయానికి వచ్చి నయా దందాను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అధిక ధరలకు అమ్మకాలు
నర్సంపేట డివిజన్లో నయా దందా ప్రారంభించిన సిండికేటుగాళ్లు అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బీరు బాటిల్ కు రూ.20 లు, బ్రాందీ ఫుల్ బాటిల్ కు రూ. 80 ల వరకు అధిక ధరలు నిర్ణయించి బెల్ట్ షాపు నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు సమాచారం. బెల్ట్ షాపు నిర్వాహకులు మరో రూ. 10 లు పెంచి మద్యం ప్రియులు జేబులకు చిల్లులు పెడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా సంబంధిత ఎక్సైజ్ పోలీసులకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మద్యం వ్యాపారుల వద్ద ముడుపులు పుచ్చుకుంటున్న అధికారులు ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మద్యం సిండికేట్ గాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Tags: wines, new trendy, shops, syndicate business.