ప్రపంచానికి కాలసర్ప దోషం.. మే5 తరువాత రిలీఫ్: స్వరూపానందేంద్ర సరస్వతి

ప్రపంచానికి కాల సర్పదోషం పట్టుకుందని.. మే 5 తరువాతే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. విశాఖపట్టణంలోని చినముషిడివాడలోని శ్రమశక్తి నగర్‌లోని శారాదా పీఠంలో ఆయన మాట్లాడుతూ, మే 5 తరువాత కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పారు. భగవన్నామస్మరణతో దేశానికి రక్షణ లభిస్తుందని ఆయన సెలవిచ్చారు. ప్రపంచానికి ఇప్పుడు కాలసర్ప దోషం పట్టుకుందని, దాని ప్రభావంతోనే కరోనా నియంత్రణలోకి రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. […]

Update: 2020-04-17 01:51 GMT

ప్రపంచానికి కాల సర్పదోషం పట్టుకుందని.. మే 5 తరువాతే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. విశాఖపట్టణంలోని చినముషిడివాడలోని శ్రమశక్తి నగర్‌లోని శారాదా పీఠంలో ఆయన మాట్లాడుతూ, మే 5 తరువాత కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని జోస్యం చెప్పారు. భగవన్నామస్మరణతో దేశానికి రక్షణ లభిస్తుందని ఆయన సెలవిచ్చారు.

ప్రపంచానికి ఇప్పుడు కాలసర్ప దోషం పట్టుకుందని, దాని ప్రభావంతోనే కరోనా నియంత్రణలోకి రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీ నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని ఆయన అన్నారు. అందుకే నెమ్మదిగా దాని ప్రభావం తగ్గి, మే 5 నాటికి పూర్తిగా తొలగుతుందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినప్పటికీ దేవుడి ఆశీస్సులతో తగ్గుతుందని అన్నారు. అయినా, ఎన్నో విపత్కర పరిస్థితులను చూసి తట్టుకుని నిలిచిన భారతీయులు, కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన చెప్పారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ వైరస్ ఏళ్ల తరబడి కొనసాగే అవకాశాలు లేవని చెప్పిన ఆయన, దీని కారణంగా ఇండియాకు పెద్దగా నష్టం కూడా జరుగబోదని కూడా చెప్పారు. కరోనా వ్యాధి నియంత్రణకు విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామని ఆయన తెలిపారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామని వెల్లడించారు. లాక్ డౌన్ పాటిస్తున్న వేళ, ఇళ్లలోనే ఉంటూ పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచుతూ, భక్తితో మెలగాలని ఆయన సూచించారు.

tags: visakha sarada peetam, swami swaroopanandendra saraswati, vizag, pendurthi

Tags:    

Similar News