పాఠశాలల్లో స్వచ్ఛ పక్షోత్సవాలు.. షెడ్యూల్ ఇదే..!

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో 15 రోజులపాటు స్వచ్ఛ పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు విద్యార్థుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాఠశాలల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ప్రధాన ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సూచించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కొవిడ్ నిబంధనల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, భౌతిక దూరాలు పాటించేలా బోధనలు చేపట్టనున్నారు. స్కూళ్లలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే ట్రెస్, టెస్టింగ్, ట్రీట్ విధానాలను […]

Update: 2021-08-30 19:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో 15 రోజులపాటు స్వచ్ఛ పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు విద్యార్థుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాఠశాలల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ప్రధాన ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సూచించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కొవిడ్ నిబంధనల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, భౌతిక దూరాలు పాటించేలా బోధనలు చేపట్టనున్నారు. స్కూళ్లలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే ట్రెస్, టెస్టింగ్, ట్రీట్ విధానాలను ఉపాధ్యాయులు అమలు పరిచేలా సూచనలు అందించనున్నారు.

సెప్టెంబర్ 1న స్వచ్ఛతా శపథం దిన్నోత్సవాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులతో పరిశుభ్రతను పాటిస్తామనే శపథం చేయిస్తారు. రెండవ రోజు నుంచి వరసగా స్వచ్ఛతా అవగాహన దినోత్సవం, సమాజానికి చేరువ కావడం, పరిశుభ్రతను ఏ విధంగా పాటించాలనే అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. హరిత దినోత్సవం రోజున చెత్త లేకుండా శుభ్రం చేయడం, చెత్త బుట్టలను వాడటం వంటి అంశాలను విద్యార్థులకు తెలియజేస్తారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతారు. స్వచ్ఛతా పోటీల దినోత్సవం రోజున పరిశుభ్రత అంశాలపై వ్యాస రచన పోటీలను నిర్వహిస్తారు. హ్యాండ్ వాష్ డే రోజున భోజనానికి ముందు చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అని అవగాహన కల్పిస్తారు.

వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవం రోజున వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను బోధిస్తారు. సమాజ భాగస్వామ్య దినోత్సవంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టి మరుగుదొడ్ల వినియోగం, మంచినీటి వసతి, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగిస్తారు. స్వచ్ఛత అమలు దినోత్సవం రోజున నీటి నిలువ, నీటి పంపిణీ పర్యవేక్షణ కార్యక్రమాలపై అవగాహనలు కల్పిస్తారు. బహుమతులు ప్రధానం దినోత్సవం రోజున స్వచ్ఛతా పక్షోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.

Tags:    

Similar News