షాకింగ్ : కరోనా టెస్ట్‌లో అపశృతి.. సర్పంచ్ ముక్కులోనే విరిగిన స్వాబ్..

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా వస్తేనే కాదు.. పరీక్షలు చేయించుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తయారైంది. కరీంనగర్ జిల్లాలో కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులోనే స్వాబ్ విరిగిపోయింది. జిల్లాలోని రామడుగు మండలం వెంకట్రావ్‌పల్లిలో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో సర్పంచ్ జవ్వాజి శేఖర్‌కు హెల్త్ సూపర్ వైజర్ కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులోనే స్వాబ్(పుల్ల) విరిగిపోయింది. విరిగిన స్వాబ్‌ను తొలగించేందుకు శేఖర్‌ను కరీంనగర్‌లోని ఈఎన్‌టీ హాస్పిటల్‌కు […]

Update: 2021-06-11 04:59 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా వస్తేనే కాదు.. పరీక్షలు చేయించుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తయారైంది. కరీంనగర్ జిల్లాలో కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులోనే స్వాబ్ విరిగిపోయింది. జిల్లాలోని రామడుగు మండలం వెంకట్రావ్‌పల్లిలో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ క్యాంప్‌లో సర్పంచ్ జవ్వాజి శేఖర్‌కు హెల్త్ సూపర్ వైజర్ కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులోనే స్వాబ్(పుల్ల) విరిగిపోయింది. విరిగిన స్వాబ్‌ను తొలగించేందుకు శేఖర్‌ను కరీంనగర్‌లోని ఈఎన్‌టీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే శేఖర్‌ను పరీక్షించిన వైద్యులు.. స్కానింగ్ చేసి ఎండో స్కోపి ద్వారా స్వాబ్ బయటకి తీసినట్టు అధికారులు తెలిపారు.

 

Tags:    

Similar News