అట్టడుగు వర్గాల ఆణిముత్యానికి ‘ఓయూ’ కీర్తి కిరీటం!
దిశ బ్యూరో, హైదరాబాద్ విద్యావేత్త, మృదుభాషి శనిగరపు వెంకట చంద్ర ప్రకాశ్(ఎస్‌వీసీ ప్రకాశ్)ను ఓయూ పాలక మండలి సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులిచ్చింది. ముఖ్యంగా విద్యారంగంపై లోతైన అవగాహన సొంతమైన ప్రకాశ్‌ను బెస్ట్ రిలవెంటు పోస్టు వరించింది. అట్టడుగు వర్గాల ఆణిముత్యమైన ఆయనకు దక్కిన గుర్తింపు కీర్తి కిరీటం వంటిదే! ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలకవర్గంలో ఆయనకు చోటు దక్కడంతో ఎడ్యుకేషన్ సెక్టారు వారు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎస్‌వీసీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. కేటీఆర్ […]
దిశ బ్యూరో, హైదరాబాద్
విద్యావేత్త, మృదుభాషి శనిగరపు వెంకట చంద్ర ప్రకాశ్(ఎస్‌వీసీ ప్రకాశ్)ను ఓయూ పాలక మండలి సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులిచ్చింది. ముఖ్యంగా విద్యారంగంపై లోతైన అవగాహన సొంతమైన ప్రకాశ్‌ను బెస్ట్ రిలవెంటు పోస్టు వరించింది. అట్టడుగు వర్గాల ఆణిముత్యమైన ఆయనకు దక్కిన గుర్తింపు కీర్తి కిరీటం వంటిదే! ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలకవర్గంలో ఆయనకు చోటు దక్కడంతో ఎడ్యుకేషన్ సెక్టారు వారు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎస్‌వీసీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. కేటీఆర్ ప్రాతినిథ్యంలోని సిరిసిల్ల సెగ్మెంట్ ముస్తాబాద్‌లో ప్రయివేటు జూనియర్ కళాశాల నిర్వాహకుడిగా మొదట్లో స్థానికంగా సుపరిచితులు. పూర్వ కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల వాస్తవ్యులైన ఎస్‌వీసీ ఉన్నత విద్యావంతులు. సమాజం పట్ల చక్కటి గ్రహణ శక్తిగల ప్రకాశ్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు, మినిస్టర్ కేటీఆర్‌ను తన మేథాశక్తి, పరిశీలనాత్మక, విశ్లేషణాత్మక కెపాసిటీలతో ఆకట్టుకున్నారు. క్రమంగా యువ నేతకు చేరువయ్యారు. ప్రధానంగా ప్రయివేటు విద్యా రంగంలోని అనేక చిక్కుముళ్లు, సమస్యలపై కేటీఆర్‌కు హృద్యమైన రీతిలో ప్రెజెంట్ చేశారు. తద్వారా యాజమాన్యాలకు, సర్కారుకు నడుమ సుహృద్భావాన్ని తేగలిగారు. ప్రకాశ్ ప్రస్తుతం తెలంగాణ ప్రయివేటు డిగ్రీ అండ్ పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.