కత్తి మహేష్ మృతిపై అనుమానం ఉంది
దిశ, భువనగిరి: ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, దళిత బహుజనవాది కత్తి మహేష్ మరణంపై అనుమానం ఉందని, మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలో జగ్జీవన్ రామ్ భవన్‌లో ఇటికాల దేవేందర్ అధ్యక్షతన జరిగిన కత్తి మహేష్ సంతాప సభలో మున్సిపల్ చైర్మన్ బర్రె బహాంగీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్, దళిత ఐక్య వేదిక […]
దిశ, భువనగిరి: ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, దళిత బహుజనవాది కత్తి మహేష్ మరణంపై అనుమానం ఉందని, మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలో జగ్జీవన్ రామ్ భవన్‌లో ఇటికాల దేవేందర్ అధ్యక్షతన జరిగిన కత్తి మహేష్ సంతాప సభలో మున్సిపల్ చైర్మన్ బర్రె బహాంగీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్, దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు భట్టు రామచంద్రయ్యలు మాట్లాడుతూ…
పేద కుటుంబంలో పుట్టి నటుడిగా, దర్శకునిగా, సినీ విమర్శకునిగా, దళిత బహుజన సామాజికవాదిగా సేవలందించిన కత్తి మహేష్ అకాల మరణం తీరని లోటు అన్నారు. కత్తి మహేష్ మరణంపై అనుమానాలు ఉన్నందున ఏపీ ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుర్పంగ శివలింగం, దర్గాయి హరి ప్రసాద్, కౌన్సిలర్ ఈరపాక నర్సింహ, పడిగేల ప్రదీప్, క్యాసగల్ల చందు, మేరుగుమల్ల ఆనంద్, భాస్కర్ నాయక్, దర్గాయి దేవేందర్, దండు నరేశ్, వరుస కిరణ్, బుగ్గ రమేశ్, దర్గాయి జహంగీర్, ఎండి కరీం తదితరులు పాల్గొన్నారు.