వీడని సందిగ్ధం.. తేలని ఐపీఎల్ భవితవ్యం

ప్రపంచ దేశాలన్నీ కరోనా ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడలే వాయిదాపడ్డాయి. అయితే ఇండియాలో ప్రేక్షకాదరణ పొందిన ఐపీఎల్ లీగ్ నిర్వహణపై బీసీసీఐ ఎటూ తేల్చడం లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని అడిగితే.. ‘లీగ్ వాయిదావేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేనందున, ఇప్పుడే ఏమీ చెప్పలేనని’ సమాధానం దాటవేశాడు. ఎప్పుడో ఖరారైన భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ)ను […]

Update: 2020-03-25 04:26 GMT

ప్రపంచ దేశాలన్నీ కరోనా ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడలే వాయిదాపడ్డాయి. అయితే ఇండియాలో ప్రేక్షకాదరణ పొందిన ఐపీఎల్ లీగ్ నిర్వహణపై బీసీసీఐ ఎటూ తేల్చడం లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని అడిగితే.. ‘లీగ్ వాయిదావేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేనందున, ఇప్పుడే ఏమీ చెప్పలేనని’ సమాధానం దాటవేశాడు. ఎప్పుడో ఖరారైన భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ)ను మార్చే అవకాశం లేకపోవడంతో మరో మూణ్నాలుగు నెలల తర్వాతైనా నిర్వహించే అవకాశం లేదన్నాడు. ప్రభుత్వం దేశం మొత్తం లాక్‌డౌన్‌ చేసిన ఈ ఆపత్కాల పరిస్థితుల్లో లీగ్‌కు బీమా సొమ్ము కూడా వచ్చే అవకాశం లేదన్నాడు.

కోల్‌కతాపై గంగూలీ ఎమోషనల్ ట్వీట్..

లాక్ డౌన్ నేపథ్యంలో కోల్‌కతా నగరంపై గంగూలీ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘మా నగరాన్ని ఇలా చూస్తానని నేనెపుడూ అనుకోలేదు. ఈ పరిస్థితి త్వరలోనే మెరుగవుతుంది. మీరైతే సురక్షితంగా ఉండండి. జాగ్రత్తలు తీసుకోండి’ అని ‘దాదా’ ట్వీట్‌ చేశాడు.

Tags: Sourav Ganguly, Lock down, Corona, IPL, BCCI, Kolkata

Tags:    

Similar News