వీలైతే సాయం చెయ్.. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకు : సుస్మిత
దిశ, సినిమా: ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల కొరతపై బాలీవుడ్ హీరోయన్ సుస్మితా సేన్ స్పందించింది. దేశ రాజధానిలోని శాంతి ముకుంద్ హాస్పిటల్ సీఈఓ సునీల్ సాగర్ ఆక్సిజన్ సిలిండర్లు లేక కరోనా రోగుల ప్రాణాలు పోతున్నాయని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో చలించిపోయిన ఆమె.. ముంబై నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్లను పంపించేందుకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ట్విట్టర్ యూజర్స్ హెల్ప్ కోరింది. అయితే ఓ యూజర్ ఆక్సిజన్ సిలిండర్ల కొరత […]
దిశ, సినిమా: ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల కొరతపై బాలీవుడ్ హీరోయన్ సుస్మితా సేన్ స్పందించింది. దేశ రాజధానిలోని శాంతి ముకుంద్ హాస్పిటల్ సీఈఓ సునీల్ సాగర్ ఆక్సిజన్ సిలిండర్లు లేక కరోనా రోగుల ప్రాణాలు పోతున్నాయని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో చలించిపోయిన ఆమె.. ముంబై నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్లను పంపించేందుకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ట్విట్టర్ యూజర్స్ హెల్ప్ కోరింది. అయితే ఓ యూజర్ ఆక్సిజన్ సిలిండర్ల కొరత అంతటా ఉంది కదా! ఢిల్లీకే ఆక్సిజన్ ఎందుకు పంపిస్తున్నావు? ముంబైలోని ఇతర ప్రాంతాలకు ఎందుకు హెల్ప్ చేయడం లేదని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన సుస్మిత.. ‘ముంబైలో ఇంకా ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఢిల్లీలో వీటి కొరత ఉంది, ముఖ్యంగా ఇలాంటి చిన్న హాస్పిటల్స్‌లో మరింత అధికంగా ఉంది’ అని వివరణ ఇచ్చింది. కాబట్టి, పరిస్థితిని అర్థం చేసుకుని వీలైతే హెల్ప్ చెయ్ అని సూచించింది.
Because mumbai still has oxygen cylinders available, that’s how I found it. Delhi needs it, especially these smaller hospitals, so help if you can.
— sushmita sen (@thesushmitasen) April 22, 2021