కంప్యూటర్ గేమ్స్ కోడింగ్ నేర్చుకుంటున్న సుశాంత్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఏ విషయం అయినా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఎప్పుడూ సరికొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడడంతో… లాక్ డౌన్ టైమ్ ను కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు యూజ్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తనకు కంప్యూటర్ గేమింగ్ అంటే చాలా ఇష్టమని… దాని వెనుకున్న భాషను నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పాడు. దీని కోసం […]

Update: 2020-04-28 07:40 GMT

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఏ విషయం అయినా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఎప్పుడూ సరికొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడడంతో… లాక్ డౌన్ టైమ్ ను కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు యూజ్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తనకు కంప్యూటర్ గేమింగ్ అంటే చాలా ఇష్టమని… దాని వెనుకున్న భాషను నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పాడు. దీని కోసం కొన్ని వారాలుగా కోడింగ్ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్పాడు సుశాంత్. ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చిందని తెలిపాడు.

కాగా సుశాంత్ ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా నటుడిగా మారిన సుశాంత్… కై పో చె సినిమా ద్వారా 2013 లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

Tags:    

Similar News