సుశాంత్ 'సవ్యసాచి' చాలెంజ్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ రొటీన్ లైఫ్‌ను చిందర వందర చేసింది. ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. కానీ తప్పదు … కరోనా చైన్ బ్రేక్ చేయాలంటే రూల్స్ ఫాలో కావాల్సిందే. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే… ప్రభుత్వం చెప్పినట్లు లాక్ డౌన్ పాటించాల్సిందే. మీరు ఈ సమయాన్ని మీరు బోర్‌గా ఫీల్ అవుతున్నారా..?? అయితే మీకో చాలెంజ్ విసురుతున్నారు హీరో సుశాంత్. ఇది మీకు కాస్త రిలాక్స్ ఇవ్వొచ్చంటున్న సుశాంత్ చాలెంజ్ ఏంటో తెలుసా…? రెండు చేతులతో ఒకేసారి […]

Update: 2020-04-02 02:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ రొటీన్ లైఫ్‌ను చిందర వందర చేసింది. ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. కానీ తప్పదు … కరోనా చైన్ బ్రేక్ చేయాలంటే రూల్స్ ఫాలో కావాల్సిందే. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే… ప్రభుత్వం చెప్పినట్లు లాక్ డౌన్ పాటించాల్సిందే. మీరు ఈ సమయాన్ని మీరు బోర్‌గా ఫీల్ అవుతున్నారా..?? అయితే మీకో చాలెంజ్ విసురుతున్నారు హీరో సుశాంత్. ఇది మీకు కాస్త రిలాక్స్ ఇవ్వొచ్చంటున్న సుశాంత్ చాలెంజ్ ఏంటో తెలుసా…? రెండు చేతులతో ఒకేసారి ఒకే మ్యాటర్ రాయడం. నర్సరీలో ఉన్నప్పుడు సుశాంత్ లెఫ్ట్ హ్యాండ్‌తో రాసేవారట…. ఆ సమయంలో టీచర్ రైట్ హ్యాండ్‌తో రాయాలని సూచించిందట. దీంతో రెండు చేతులతో రాయడం నేర్చుకున్నాడట. స్పోర్ట్స్ విషయానికొస్తే బ్యాటింగ్, బౌలింగ్, టెన్నిస్ కుడిచేతితో ఆడుతానని తెలిపిన సుశాంత్…. థ్రో, క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు మాత్రం ఎడమ చేతిని యూజ్ చేస్తానని చెప్పాడు. మీలో ఇలాంటి అనుభవం ఉన్నవారు ఉంటే… వెంటనే ఈ చాలెంజ్‌ను స్వీకరించి వీడియోలు పంపించాలని కోరాడు. సుశాంత్ రెండు చేతులతో ఒకే సారి రాస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా… నువ్వు సవ్యసాచివి సుశాంత్ అంటూ పొగిడేస్తున్నారు.


Tags: Sushanth, Challenge, Lock Down, Quarentine

Tags:    

Similar News