Sushant Singh Rajput : డ్రగ్స్ కేసులో సుశాంత్ ఫ్రెండ్ అరెస్ట్

దిశ, సినిమా : లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్‌మేట్, ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని (Siddharth Pithani )ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. సుశాంత్ డెత్, డ్రగ్స్ (drugs) కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఈ రోజు(శుక్రవారం) ఉదయం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. కాగా సిద్ధార్థ్‌ను గతేడాది సీబీఐ, ఈడీ చాలాసార్లు ఇంటరాగేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక సుశాంత్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అతను చనిపోయిన ఏడాది తర్వాత […]

Update: 2021-05-28 02:41 GMT
Sushant Singh Rajputs Flatmate Siddharth Pithani Arrested
  • whatsapp icon

దిశ, సినిమా : లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్‌మేట్, ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని (Siddharth Pithani )ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. సుశాంత్ డెత్, డ్రగ్స్ (drugs) కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఈ రోజు(శుక్రవారం) ఉదయం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. కాగా సిద్ధార్థ్‌ను గతేడాది సీబీఐ, ఈడీ చాలాసార్లు ఇంటరాగేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక సుశాంత్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అతను చనిపోయిన ఏడాది తర్వాత తన స్నేహితుడిని అరెస్ట్ చేయడం గమనార్హం. అంతేకాదు సుశాంత్ చనిపోయిన సమయంలో ఫ్లాట్‌లో ఉన్నట్లు గుర్తించిన నలుగురిలో సిద్ధార్థ్ ఒకడు కావడం విశేషం. కాగా డ్రగ్స్ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిపై పలు అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News