CBSE ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ

దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. పరీక్షల నిర్వహణ లేదా? రద్దుపై నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో తమ నిర్ణయం చెప్పేందుకు జూన్ 3వ తేదీ వరకూ సమయం ఇవ్వాలని కేంద్రం గడువు కోరింది. దీంతో గడువును మంజూరు చేస్తూ తదుపరి విచారణను జూన్ 3 వ తేదీకి వాయిదా వేసింది. కాగా, దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ర‌కాల ప‌రీక్షల వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. […]

Update: 2021-05-31 01:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. పరీక్షల నిర్వహణ లేదా? రద్దుపై నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో తమ నిర్ణయం చెప్పేందుకు జూన్ 3వ తేదీ వరకూ సమయం ఇవ్వాలని కేంద్రం గడువు కోరింది. దీంతో గడువును మంజూరు చేస్తూ తదుపరి విచారణను జూన్ 3 వ తేదీకి వాయిదా వేసింది. కాగా, దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ర‌కాల ప‌రీక్షల వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇప్పటికే ప‌లు రాష్ట్రాలు ప‌రీక్షల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షల నిర్వహ‌ణ విష‌యంలో గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News