రేవంత్ తరపున సుప్రీం న్యాయవాది వాదనలు.. ఏ కేసులో అంటే !

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టగా.. ఎంపీ రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా హాజరయ్యారు. కేసు ఎన్నికల అంశం కాబట్టి ఎలక్షన్ ట్రైబ్యునల్‌లో విచారణ జరపాలని రేవంత్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థా లూథ్రా వాదనలు వినిపించారు. ఏసీబీ తరపున స్పెషల్ పీపీ సురేందర్‌రావు వాదనలు […]

Update: 2021-01-04 05:28 GMT
రేవంత్ తరపున సుప్రీం న్యాయవాది వాదనలు.. ఏ కేసులో అంటే !
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టగా.. ఎంపీ రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా హాజరయ్యారు. కేసు ఎన్నికల అంశం కాబట్టి ఎలక్షన్ ట్రైబ్యునల్‌లో విచారణ జరపాలని రేవంత్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థా లూథ్రా వాదనలు వినిపించారు. ఏసీబీ తరపున స్పెషల్ పీపీ సురేందర్‌రావు వాదనలు వినిపించారు. ఈ కేసుపై రేపు కూడా న్యాయస్థానంలో వాదనలు జరనున్నాయి.

Tags:    

Similar News