కరోనా కట్టడికి సుప్రీం కీలక ఆదేశాలు.. రంగంలోకి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా కేసుల విజృంభణ, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తమకు ఆక్సిజన్, వ్యాక్సిన్లను పంపించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దీనంతటినీ పరిశీలిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు కీలక […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా కేసుల విజృంభణ, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తమకు ఆక్సిజన్, వ్యాక్సిన్లను పంపించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.
దీనంతటినీ పరిశీలిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది.12 మంది సభ్యులతో కూడిన స్పెషల్ టాస్క్‌ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్, ఆక్సిజన్, మందుల పంపిణీ అంశాలను పర్యవేక్షించేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపిణీ అయ్యే ప్రతీ మెడిసిన్, ఆక్సిజన్ మీద టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ ఉండటంతో పాటు రిపోర్టులను ప్రిపేర్ చేయనుంది.