అజయ్ సింగ్ డోపీ కాదు

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ బైక్ చాంపియన్ అజయ్ సింగ్ డోపీ కాదని, అసలు మూడేళ్ల క్రితం నోయిడాలో తీసిన శాంపిల్స్ అతడికి చెందినవే కావని లండన్‌లోని ల్యాబ్‌లో తేలింది. గ్రేటర్ నోయిడాలో 2018లో ఒక బైక్ రేసింగ్‌లో పాల్గొన్న అజయ్ సింగ్ శాంపిల్స్‌ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సేకరించింది. ఆ శాంపిల్స్‌లో అనబోలిక్ స్టెరాయిడ్లు వాడినట్లు తేలింది. అయితే ఎలాంటి మెడికేషన్‌లో లేని అజయ్ డోప్ టెస్టులో పాజిటివ్‌గా రావడంతో ఆశ్చర్యపోయాడు. అసలు […]

Update: 2021-06-05 11:51 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ బైక్ చాంపియన్ అజయ్ సింగ్ డోపీ కాదని, అసలు మూడేళ్ల క్రితం నోయిడాలో తీసిన శాంపిల్స్ అతడికి చెందినవే కావని లండన్‌లోని ల్యాబ్‌లో తేలింది. గ్రేటర్ నోయిడాలో 2018లో ఒక బైక్ రేసింగ్‌లో పాల్గొన్న అజయ్ సింగ్ శాంపిల్స్‌ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సేకరించింది. ఆ శాంపిల్స్‌లో అనబోలిక్ స్టెరాయిడ్లు వాడినట్లు తేలింది. అయితే ఎలాంటి మెడికేషన్‌లో లేని అజయ్ డోప్ టెస్టులో పాజిటివ్‌గా రావడంతో ఆశ్చర్యపోయాడు.

అసలు బాడీ బిల్డింగ్ కోసం వాడే అనబోలిక్ స్టెరాయిడ్లను తానెందుకు వాడతానని నాడా ముందు వాదించాడు. కానీ గత ఏడాది జనవరిలో అజయ్ సింగ్‌పై నాడా నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. దీంతో అతడు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) తలుపు తట్టాడు. తన శాంపిల్స్‌పై డీఎన్ఏ టెస్టు చేయాలని కోరాడు. వాడా ఒప్పుకున్నా నాడా మాత్రం తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టులో తన శాంపిల్స్ మళ్లీ తీసుకొని అప్పటి శాంపిల్స్ డీఎన్ఏతో పోల్చాలని అజయ్ కోరాడు.

కోర్టు ఆర్డర్ మేరకు లండన్‌లోని వాడా అక్రిడేటెడ్ ల్యాబ్‌లో శాంపిల్స్ పోల్చి చూడగా అసలు అవి అజయ్ సింగ్‌వే కావని తేలింది. ‘తనకు డబ్బు ఉంది కాబట్టి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని పోరాడాను. అదే పేద అథ్లెట్స్ ఎవరైనా ఇలా పొరపాటున నిషేధానికి గురైతే ఏం చేస్తారు. వారి కెరీర్ నాశనం అవడమే కదా’ అని అజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News