సూపర్ స్ప్రైడర్‌లు అందరికీ వ్యాక్సిన్ వేయండి : ఎమ్మెల్యే

దిశ, కల్వకుర్తి: సూపర్ స్పైడర్‌కు ప్రత్యేకంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పగడ్బంధీగా నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా అధికారులకు వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో గుర్తించిన మీడియా ప్రతినిధులకు, రేషన్ డీలర్లు, సిబ్బంది, పెట్రోల్ బంక్ యాజమాన్యం, సిబ్బంది, విత్తనాల, క్రిమిసంహారక మందుల డీలర్లు, సిబ్బంది […]

Update: 2021-05-28 04:32 GMT

దిశ, కల్వకుర్తి: సూపర్ స్పైడర్‌కు ప్రత్యేకంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పగడ్బంధీగా నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా అధికారులకు వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో గుర్తించిన మీడియా ప్రతినిధులకు, రేషన్ డీలర్లు, సిబ్బంది, పెట్రోల్ బంక్ యాజమాన్యం, సిబ్బంది, విత్తనాల, క్రిమిసంహారక మందుల డీలర్లు, సిబ్బంది ప్రతి ఒక్కరికీ టీకా వేయించాలి అని చెప్పారు. సూపర్ స్పైడర్లందరికీ టీకా వేసేలా చూడాలన్నారు. టీకాపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, వైద్యాధికారి బాబర్, ఆర్డీవో రాజేష్ డిపిఆర్ఓ సిబ్బంది శైలజ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News