గెలిచి నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను పదిలంగా ఉంచుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 120 పరుగులకే సరిపెట్టుకుంది. దీంతో 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 14.1 ఓవర్లలోనే టార్గెట్‌ను రీచ్ చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్: తొలుత ఓపెనింగ్ దిగిన డేవిడ్ వార్నర్ (8) పరుగులకే వెనుదిరిగినా.. వృద్ధిమాన్ సాహ (39) […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను పదిలంగా ఉంచుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 120 పరుగులకే సరిపెట్టుకుంది. దీంతో 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 14.1 ఓవర్లలోనే టార్గెట్‌ను రీచ్ చేసింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్:
తొలుత ఓపెనింగ్ దిగిన డేవిడ్ వార్నర్ (8) పరుగులకే వెనుదిరిగినా.. వృద్ధిమాన్ సాహ (39) పరుగులతో రాణించాడు. వీరిద్దరి వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టుకు మనీష్ పాండే (26) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక కేన్ విలియమ్సన్(8), అభిషేక్ శర్మ (8) పరుగులకే వెనుదిరిగారు. దీంతో బెంగళూరు బౌలర్లు బ్యాట్స్‌మెన్ల పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే 114 పరుగులకు సన్‌రైజర్స్ 5 వికెట్లను కోల్పోయింది. కానీ, అప్పటికే క్రీజులో ఉన్న ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 10 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో సన్‌రైజర్స్ విజయం లాంఛనమైంది.
బెంగళూరు ఇన్నింగ్స్:
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 120 పరుగులకే పరిమితమయ్యారు. ఓపెనర్ జోష్ ఫిలిప్ (32), డివిలియర్స్ (24), వాషింగ్టన్ సుందర్ (21) ఈ ఆటగాళ్లు మినహా ఏ ఒక్కరు 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దేవదత్ పడిక్కల్ (5), విరాట్ కోహ్లీ (7), క్రిస్ మోరిస్ (3), ఇసురు ఉదాన(0) డకౌట్‌గా వెనుదిరిగారు. కాగా, గురుకీరత్ సింగ్ మన్ (15), మహ్మమద్ సిరాజ్ (2) పరుగులతో నాటౌట్ నిలిచారు. దీంతో RCB జట్టు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్కోర్ బోర్డ్:
Royal Challengers Bangalore Innings: 120-7 (20 Ov)
1. జోష్ ఫిలిప్ c మనీష్ పాండే b రషీద్ ఖాన్ 32(31)
2. దేవదత్ పడిక్కల్ b సందీప్ శర్మ 5(8)
3. విరాట్ కోహ్లీ (c)c విలియమ్సన్ b సందీప్ శర్మ 7(7)
4. ఏబీ డివిలియర్స్ (wk)c అభిషేక్ శర్మ b నదీమ్ 24(24)
5. వాషింగ్టన్ సుందర్ c and b టి.నటరాజన్ 21(18)
6. గురుకీరత్ సింగ్ మన్ నాటౌట్ 15(24)
7. క్రిస్ మోరిస్ c వార్నర్ b హోల్డర్ 3(4)
8. ఇసురు ఉదాన c విలియమ్సన్ b హోల్డర్ 0(1)
9. మహ్మద్ సిరాజ్ నాటౌట్ 2(3)
ఎక్స్‌ట్రాలు: 11
మొత్తం స్కోరు: 120-7
వికెట్ల పతనం: 13-1 (దేవదత్ పడిక్కల్, 2.5), 28-2 (విరాట్ కోహ్లీ, 4.4), 71-3 ((ఏబీ డివిలియర్స్, 10.6), 76-4 (జోష్ ఫిలిప్, 11.4), 99-5 (వాషింగ్టన్ సుందర్, 15.6), 113-6 (క్రిస్ మోరిస్, 18.2), 114-7 (ఇసురు ఉదాన, 18.4).
బౌలింగ్:
1. సందీప్ శర్మ 4-0-20-2
2. జాసన్ హోల్డర్ 4-0-27-2
3. టి.నటరాజన్ 4-0-11-1
4. షాబాజ్ నదీమ్ 4-0-35-1
5. రషీద్ ఖాన్ 4-0-24-1
Sunrisers Hyderabad Innings: 121-5 (14.1 Ov)
1. డేవిడ్ వార్నర్ (c)c ఉదాన b వాషింగ్టన్ సుందర్ 8(5)
2. వృద్ధిమాన్ సాహ (wk)st డివిలియర్స్ b చాహల్ 39(32)
3. మనీష్ పాండే c క్రిస్ మోరిస్ b చాహల్ 26(19)
4. కేన్ విలియమ్సన్ c కోహ్లీ b ఉదాన 8(14)
5. అభిషేక్ శర్మ నాటౌట్ c గురుకీరత్ సింగ్ b నవదీప్ సైని 8(5)
6. జాసన్ హోల్డర్ నాటౌట్ 26(10)
7.అబ్దుల్ సమద్ నాటౌట్ 0(0)
ఎక్స్‌ట్రాలు: 6
మొత్తం స్కోరు: 121-5
వికెట్లపతనం: 10-1 (డేవిడ్ వార్నర్, 1.2), 60-2 (మనీష్ పాండే, 6.4), 82-3 (వృద్ధిమాన్ సాహ, 10.6), 87-4 (కేన్ విలియమ్సన్, 12.1), 114-5 (అభిషేక్ శర్మ, 13.5).
బౌలింగ్:
1. క్రిస్ మోరిస్ 2-0-19-0
2. వాషింగ్టన్ సుందర్ 3-0-21-1
3. నవదీప్ సైని 2-0-30-1
4. మహ్మద్ సిరాజ్ 1-0-12-0
5. యూజువేంద్ర చాహల్ 3.1-0-19-2
6. ఇసురు ఉదాన 3-0-20-1