అయోధ్య మసీదు స్థలంలో హాస్పిటల్?

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య వివాదాస్పద స్థలం గురించి అందరికీ తెలిసిందే. దాని కోసం ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చివరికు సుప్రీంకోర్టు దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించింది. హిందువులకు వివాదాస్పద స్థలం కేటాయించి.. అదే అయోధ్యలో మసీదు కోసం 5ఎకరాల స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది. కానీ, మసీదు నిర్మాణానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. […]

Update: 2020-08-12 07:21 GMT

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య వివాదాస్పద స్థలం గురించి అందరికీ తెలిసిందే. దాని కోసం ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చివరికు సుప్రీంకోర్టు దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించింది. హిందువులకు వివాదాస్పద స్థలం కేటాయించి.. అదే అయోధ్యలో మసీదు కోసం 5ఎకరాల స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది. కానీ, మసీదు నిర్మాణానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

అయితే, తాజాగా మసీదు స్థలంలో ఆస్పత్రి నిర్మించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతకుమందు ఆ స్థలంలో ఆస్పత్రి లేదా యూనివర్శిటీ నిర్మించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో బలంగానే విన్పించింది. కాగా, బాబ్రీ మసీదుకు కేటాయించిన స్థలంలో ఆస్పత్రి నిర్మించబోతున్నారనే ప్రచారం తాజాగా జోరందుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడయాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.‘బాబ్రీ హాస్పిటల్‌’ పేరుతో ఉన్న ఫొటోలు, వీడియాలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆరా తీయగా.. ఆ భవనం అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో ఉన్న ఆస్పత్రి అని తేలింది. ఫొటోషాప్ ద్వారా బాబ్రీ హాస్పిటల్ అని పేరు మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా దీనిపై సున్నీ వక్ఫ్‌బోర్డు స్పందించి ఆగస్టు 7న ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే రోజుల్లో ఆ స్థలంలో ఇండో-ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించనున్నట్లు సున్నీ వక్ఫ్‌బోర్డు ప్రకటించింది. దీంతో ఇన్నిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారానికి తెలపడింది.

Tags:    

Similar News