రక్తంతో తడిసిన హీరో సందీప్ కిషన్ చేతికి సంకెళ్లు..!
దిశ, సినిమా : టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి పాన్ ఇండియన్ ఫిల్మ్‌లో కలిసి పనిచేయబోతున్నారు. ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండగా.. ఆయన బర్త్‌డే సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘మైకేల్’ పేరుతో రిలీజ్ చేసిన పోస్టర్‌లో చేతులకు బేడీలతో కనిపిస్తున్న సందీప్ కిషన్ షర్ట్ మొత్తం రక్తపు మరకలతో ఉంది. చూస్తుంటే సినిమాలో తనది ఇంటెన్స్ క్యారెక్టర్ అని అర్థమవుతుండగా.. విజయ్ సేతుపతి […]
దిశ, సినిమా : టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి పాన్ ఇండియన్ ఫిల్మ్‌లో కలిసి పనిచేయబోతున్నారు. ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండగా.. ఆయన బర్త్‌డే సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘మైకేల్’ పేరుతో రిలీజ్ చేసిన పోస్టర్‌లో చేతులకు బేడీలతో కనిపిస్తున్న సందీప్ కిషన్ షర్ట్ మొత్తం రక్తపు మరకలతో ఉంది. చూస్తుంటే సినిమాలో తనది ఇంటెన్స్ క్యారెక్టర్ అని అర్థమవుతుండగా.. విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సేతుపతికి సంబంధించిన లుక్ త్వరలోనే రివీల్ చేయనున్నారు మేకర్స్. కాగా ‘మైకేల్’ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన సేతుపతి.. ప్రొడ్యూసర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపాడు.
https://twitter.com/VijaySethuOffl/status/1431119506559025153?s=20
ఇక సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుండగా.. ప్రేక్షకులకు స్ర్కీన్ మీద ఐఫీస్ట్ ఫీలింగ్ ఇస్తుందని మేకర్స్ వెల్లడించారు. రంజిత్ జెయకోడి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్.. తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్స్‌పై భరత్ చౌదరి, పుస్కూర్ రాంమోహన్ రావు, నారాయణ్ దాస్ కే నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.